18-12-2025 06:01:44 PM
ఉమ్మడి జిల్లా గోపా ప్రతినిధి బుర్ర జగదీశ్వర్ గౌడ్
సుల్తానాబాద్ (విజయక్రాంతి): గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ గోపా స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా గోపా ప్రతినిధి బుర్ర జగదీశ్వర్ గౌడ్ అన్నారు గోపా స్వర్ణోత్సవాలకు సంబంధించి పోస్టర్ ను గురువారం సుల్తానాబాద్ లోని గౌడ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ జాతి ఎదుర్కొంటున్న సమస్యలు, యువతకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు, రాజకీయ రంగంలో గౌడ ప్రాతినిధ్యంపై ఈనెల 26న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గోపా సరోత్సవాలకు అధిక సంఖ్యలో గౌడ ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ ప్రతినిధులు అడ్డగుంట రాజేందర్, బైరగోని రవీందర్ గౌడ్, ఏరు కొండ తిరుపతి, వేముల కిరణ్, పోడేటి వెంకటేష్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, ముత్యం నరేష్ గౌడ్, కొయ్యడ రమాకాంత్ తదితరులున్నారు.