calender_icon.png 19 December, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్మానం

18-12-2025 06:04:12 PM

హాజీపూర్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట్ గ్రామ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు తన నివాసం వద్ద గురువారం సన్మానించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించి నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన జాడి వెంకటేష్ ని, ఉప సర్పంచ్ గాడిపెల్లి కవిత రవితో పాటు వార్డు మెంబర్లు జాడి బుచ్చమ్మ, రావుల రవీందర్, అర్క ప్రవీణ్, కొట్టాల లక్ష్మి శ్రీనివాస్, కొండగురుల అనిల్ లను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.