18-12-2025 05:56:50 PM
నిర్మల్ (విజయక్రాంతి): దేశంలో అధికారుల ఉన్న మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్ర నాయకులపై కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం గాంధీ పార్క్ లో నిరసన తెలిపారు. డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ అర్జున్ మంద్ అలీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.