calender_icon.png 19 December, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక సేవకుడికి సన్మానం

18-12-2025 05:40:21 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో జాతీయ సమైక్యతను చాటుతూ వివిధ వర్గాలకు అంత్యక్రియలో సహకారం అందిస్తున్న సామాజిక కార్యకర్త సాగిపోతన్నకు సన్మానం నిర్వహించారు. పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ పెన్షన్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్సీ లింగన్న ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే స్పూర్తిగా ముందు వెళ్లాలని పలువురు వక్తలు ఆయన సేవలను కొనియాడారు.