18-12-2025 05:54:27 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్ శిశుమందిర్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు గురువారం విరాళాలు అందించారు. పూర్వ విద్యార్థులు శ్రీకాంత్ భీమేష్ రాజు బద్రి దేవిదాస్ విహార్ ప్రకాష్ కిషన్ తదితర విద్యార్థులు 1,10,000 బెంచ్ లతో పాటు 20000 విలువచేసే టీవీలను విరాళంగా అందించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్ కుమార్ తెలిపారు. విరాళాలు అందించిన దాతలను పాఠశాలలో సన్మానం చేశారు.