calender_icon.png 20 October, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరుల త్యాగం.. అజరామరం

20-10-2025 02:05:39 AM

  1. రేపు గోషామహల్‌లో పోలీసు సంస్మరణ దినం
  2. హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి 
  3. పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు
  4. ప్రజలు భాగస్వాములు కావాలి 
  5. డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 19 (విజయక్రాంతి): విధి నిర్వహణలో ప్రా ణాలర్పించిన పోలీసు యోధులను స్మరించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధ మైంది. అక్టోబర్ 21న ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని’ పురస్కరించు కుని హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ప్రధాన కార్యక్రమా న్ని ఘనంగా నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమరవీరులకు నివాళులర్పిస్తారని, పోలీసులను ఉద్దేశించి ప్రసంగిస్తారని డీజీపీ బి. శివధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల21 నుంచి 31 వరకు పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టను న్నట్లు ఆయన వెల్లడించారు. పోలీసుల త్యాగాలను ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియజేసేలా పది రోజుల పాటు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు డీజీపీ వివరించారు. ప్రజలకు చేరువగా ఓపెన్ హౌస్‌లు.. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువత పోలీస్ స్టేషన్లను సందర్శించేలా ఓపెన్ హౌస్లు నిర్వహిస్తారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సీసీటీవీల పనితీరు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.

పోటీలతో అవగాహన..

విద్యార్థులకు మాదకద్రవ్యాల నివారణలో పోలీసుల పాత్ర అనే అంశంపై తెలు గు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. అలాగే, పోలీసుల పనితీరుపై షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు కూడా ఉంటాయి. విజేతల కు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో బహుమతులు ప్రదానం చేస్తారు.అమరవీరుల కుటుంబాలకు అండగా.. అమర పోలీసుల కుటుంబ సభ్యులను ఉన్నతాధికారులు కలిసి, వారి సంక్షేమ సమస్యలను పరిష్కరిస్తారు.

వారి గ్రామాల్లోని అమరవీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తారు. రక్తదాన శిబిరాలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా కేంద్రాలు, బెటాలియన్లలో రక్తదాన శిబిరాలు ఏర్పా టు చేసి, ప్రాణదాతలుగా నిలుస్తారు. ర్యాలీలు, ప్రదర్శనలు...యువత భాగస్వామ్యంతో శాంతి, ఐక్యతకు ప్రతీకగా సైకిల్ ర్యాలీలు, ట్యాంక్ బండ్తో సహా పలు బహిరంగ ప్రదేశాల్లో పోలీస్ బ్యాండ్ ప్రదర్శన లు నిర్వహిస్తారు.పోలీసు సిబ్బందిలో వృత్తి నైపుణ్యాన్ని, ఆలోచనా శక్తిని పెం పొందించేందుకు పని ప్రదేశంలో లింగ వివక్ష  క్షేత్రస్థాయి పోలీసింగ్‌ను బలోపేతం చేయడం వంటి అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.