calender_icon.png 20 October, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర బంద్‌తో చరిత్ర సృష్టించాం

20-10-2025 02:05:39 AM

  1. బంద్‌ను చూసైనా ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించాలి 
  2. బిల్లును ఆమోదించే వరకు పోరాటం ఆపేది లేదు 
  3. దీపావళి తర్వాత బీసీ జేఏసీ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తాం  
  4. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఈ నెల 18న నిర్వహించిన రాష్ట్ర బంద్ కనీవినీ ఎరుగనిగితో విజయవంతం అయిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలు ఇచ్చిన మొట్టమొదటి దిగ్విజయంగా కొనసాగి చరిత్ర సృష్టించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివిధ బీసీ సంఘాల నేతలతో కలిసి జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర బంద్ ఒక ట్రైలర్ మాత్రమేనని, బీసీ రిజర్వేషన్ల కు రాజ్యాంగబద్ధత కల్పించే వరకు తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు, రాష్ట్ర బంద్ చూసైనా కేంద్ర,

రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ ప్రక్రియకను మొదలుపె ట్టాలని డిమాండ్ చేశారు. దీపావళి పండుగ తర్వాత బీసీ జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. బీసీ బంద్‌కు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు, సంఘాలకు, వర్ధక వాణిజ్య వ్యాపారులకు, పోలీసులకు శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

బీసీ బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొని క్రియాశీలకంగా పనిచేసిన 33 జిల్లాల బీసీ ఉద్యమ శ్రేణులకు, బీసీ కుల సంఘాల నేతలకు అభినందనలు,ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సామాజిక న్యాయం కోసం, హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమావేశంలో ఓయూ బీసీ విద్యార్థి సంఘం ఇన్‌చార్జ్ బొల్లెపల్లి స్వామిగౌడ్, రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం,

బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కేపీ మురళీకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కానకాల శ్యాం కురుమ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దిటి మల్లయ్య, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ బీసీ నేతలు గూడూరు భాస్కర్ మేరు, లింగం గౌడ్, నరసింహ చారి, తదితరులు పాల్గొన్నారు.