calender_icon.png 22 October, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

22-10-2025 01:24:42 AM

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి టౌన్ అక్టోబర్ 21:దేశ సరిహద్దు భద్రతలో సైనికుడు ఎంత కీలకమో, రాష్ట్ర భద్రతలో పోలీసు కూడా అంతే కీలకమని పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుం దని ప్రజా అవసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ, పోలీసు వ్యవస్థని జిల్లా ఎస్పీ రా వుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పో లీసు పరేడ్ మైదానంలో పోలీసు అమరుల సం స్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ గౌరవ వందనం స్వీకరించి అమరుల పోలీసు కుటుంబ సభ్యులు మరియు అధికారులు సిబ్బందితో కలిసి అమరవీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ....సమాజంలో శాంతి స్థాపన కోసం అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయమని, అమ రవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత, రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాయుధ దళ అదనపు ఎస్పీ, వీరారెడ్డి,వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు,డిసిఆర్బి డిఎస్పీ, ఉమామహేశ్వరరావు, జిల్లా పోలీసు కార్యాలయం ఏ ఓ, సునందన, వనపర్తి సీఐ, కృష్ణయ్య, వివిధ మండలాల ఎస్‌ఐ లు పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, జిల్లాలోని పోలీసు సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.