22-10-2025 01:23:06 AM
చారకొండ, అక్టోబర్ 21: మండలంలోని శిరుసనగండ్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 20 మంది అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గువ్వల మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ పటిష్టతకు నిరంతరం పని చేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చెలమోని కృష్ణ, ఉపాధ్యక్షులు కామోజీ శ్రీకాంత్, నాయకులు రవి, నరేష్, పెద్దిరాజు, శ్రీరాములు, చంద్రారెడ్డి, శ్రీను, రవీందర్, వెంకటేశ్వర్లు, శ్రీపాల్ రెడ్డి, సత్తిరెడ్డి, లక్ష్మణ్, మల్లేష్ తదితరులుపాల్గొన్నారు.