18-12-2025 01:56:27 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని రాస్పల్లి సర్పంచ్ అభ్యర్థి బుధవారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సర్పంచ్ ఎన్నికల బరిలో దిగిన రాజయ్య.. ఖర్చుల కోసం రెండు ఎకరాల చేను విక్రయించాడు. చేను విక్రయ డబ్బులు సమయానికి అందకుండా ప్రత్యర్థులు అడ్డుకున్నారని మనస్థాపానికి గురైన రాజయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. కాగజ్‌నగర్ లోని హాస్పిటల్‌కు తరలించారు.