calender_icon.png 18 December, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంగ్ల విభాగంలో కుమ్మరి కృష్ణ ప్రసాద్‌కు డాక్టరేట్ ప్రదానం

18-12-2025 01:58:03 AM

డిచ్ పల్లి, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో  ప్రొఫెసర్ రమణాచారి పర్యవేక్షణలో పరిశొధక విద్యార్థి కుమ్మరి కృష్ణ ప్రసాద్ ‘సెల్ఫ్, సొసైటీ అండ్ ద మిడిల్ క్లాస్ ఇన్ ద సెలెక్టెడ్ నావల్స్ ఆఫ్ మంజు కపూర్‘ అనే అంశంపై  సమర్పించిన సిద్ధాంత గ్రంథం పై బుధవారం మౌఖిక పరీక్ష  జరిగింది. ఈ మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్‌ఎగ్జామినర్  వారి హైద్రాబాద్ నుండి ప్రొఫెసర్   సోన్బా సాల్వే హాజరై సిద్ధాంత గ్రంధాన్ని సమీక్షించి కుమ్మరి కృష్ణ ప్రసాద్ కు పీహెచ్డీ  అవార్డు ప్రధానం చేయాల్సిందిగా విశ్వవిద్యాలయ అధికారులకు సూచించినారు.

ఈ మౌఖిక పరీక్ష లో  డీన్ ప్రొఫెసర్ లావణ్య, హెడ్ ఆఫ్ ద డిపార్టుమెంటు డాక్టర్. సమత బొర్డ్ ఆఫ్ స్టడిస్ డాక్టర్ కె.వి.రమణ చారి, ఫ్యాకల్టీ డాక్టర్ స్వామి రావు, డా.జ్యోత్న, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పీహెచ్డీ సాధించిన కుమ్మరి కృష్ణ ప్రసాద్ ని వైస్ ఛాన్స్లర్ ఆచార్య  టీ.యాదగిరి రావు,  రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి, మరియు పరీక్షల నియంత్రణ అధికారి కె.సంపత్ కూమార్ ప్రత్యేకంగ అభినందనలు తెలిపారు.