15-12-2025 12:00:00 AM
లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి
ఎల్బీనగర్, డిసెంబర్ 14 : లింగోజిగూడ డివిజన్ పరిధిలో దోమల సమస్య తీవ్రంగా ఉందని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు. దోమలు పెరుగుతున్న నేపథ్యంపై అధికారులు తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. లింగోజిగూడ డివిజన్ వార్డ్ కార్యాలయంలో శుక్రవారం ఎంటమాలజీ విభాగం ఎస్‌ఈ మాధవ్ రెడ్డి, ఏఈ మన్నమ్మతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
డివిజన్ పరిధిలోని అనేక కాలనీల్లో ప్రజలు దోమల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొన్ని ముఖ్య సూచనలు చేశారు. మూడు రోజుల పాటు దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. సరూర్ నగర్ చెరువు లో గుర్రపు డెక్క, చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించాలని ఆదేశించారు.
సరూర్ నగర్ చెరువులో డ్రోన్లతో రసాయనాల పిచికారీ..
సరూర్ నగర్ చెరువులో దోమల నివారణకు డ్రోన్ ద్వారా రసాయనాలను పిచికారి చేసినట్లు ఎంటమాలజీ ఏఈ మనమ్మ తెలిపారు. ఎంటమాలజీ ఎస్‌ఈ మాధవరెడ్డి ఆదేశాలతో పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. దోమల బెడద లేకుండా ఫాగింగ్ చేయడంతోపాటు చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తు న్నట్లు తెలిపారు.