15-12-2025 12:00:00 AM
ఘట్‌కేసర్, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : రైలు ఢీకొట్టడంతో ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకు యంనంపేట్ సమీపంలోని రైలు పట్టాలపై ఓ మహిళ మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం రావడంతో వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి విచారణ చేయడం జరిగిందన్నారు.
అట్టి మృతురాలు గుర్తు తెలియని మహిళ వయస్సు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. రైల్వే ట్రాక్ పట్టాలు దాటుచుండగా ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్టగా అక్కడి కక్కడే మృతిచెందినట్టు పైకి కనిపిస్తున్నట్లు తెలిపారు. మృతురాలి ఒంటిపై బట్టలు పింక్ బ్లాక్ కలర్ నైటీ ఉన్నదని గుర్తించిన వారు సెల్ నెంబర్లు 9440083160, 8701268585 లకు సమాచారం తెలుపగలరని ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు.