17-01-2026 12:00:00 AM
నల్లగొండ క్రైం, జనవరి 16 : ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లా కేంద్రంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ రైల్వే స్టేషన్ లో గురువారం రాత్రి రైల్వే కూలీలు పనులు చేస్తున్న సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూలీలముఠా, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కూలీల ముఠా మధ్యన వివాదం తలెత్తినట్లు తెలిపారు. ఈ వివాదం మరింత ముదరడంతో నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి గ్రామానికి చెందిన చంద్రు(35)పై రాళ్లతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడన్నారు.
అయితే ఈ ఘటనలో చంద్రు అన్నతో పాటు వారి మేస్త్రికి కూడా గాయలైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో నల్గొండ టూటౌన్ ఎస్‌ఐ వై.సైదులు ఘటనా స్థలికి చేరకుని వివరాలు సేకరించారు. అలాగే ఘటన స్థలంలో ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పాటలు పెట్టీ డాన్స్ వేసే విషయంలో వివాదం తలెత్తిందా, లేదా ఇతర సంఘటనలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర సైదులు తెలిపారు.