04-10-2025 12:00:00 AM
వలిగొండ, అక్టోబర్ 3 (విజయక్రాంతి) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఈనెల 8న తెలియజేయ నుండడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే ఆశావాహులలో రోజురోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్లు ప్రకటించగా ఈ నెల 8న కోర్టు తెలియజేసే తీర్పుతో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు ఉంటాయా లేక మారుతాయా అనే ఉత్కంఠత సర్వత్ర నెలకొంది. అయితే ఎన్నికల నిర్వహణకు సమయం లేకపోవడంతో ఆశావాహులు పోటాపోటీగా తమ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రదక్షిణాలు ప్రారంభించి, దసరా సందర్భంగా తమ అనుచరగణాలకు విందులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.