10-09-2025 12:00:00 AM
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన
నెట్వర్క్ సెప్టెంబర్ 9, (విజయక్రాంతి): ప్రజాకవి కాళోజి సేవలు చిరస్మరణీయం అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ తో కలసి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, భాషలకు చిరస్థాయి గుర్తింపును తెచ్చిపెట్టారని తెలిపారు. ఆయన కేవలం కవి మాత్రమే కాకుండా సామాజిక ఉద్యమకారుడు, ప్రజా చై తన్యవేత్తగా తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని వివరించారు. తెలంగాణ మాండలిక భాషలో సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ సాధారణ ప్రజల హృదయాలను తాకిన రచనలు ఆయనవి కావడంతోనే ప్రజాకవి అనే బిరుదును అందుకున్నారని చెప్పారు.
కాళోజీ రచనలు ప్రజలకు ధైర్యాన్ని, సామాజిక అవగాహనను కలిగించాయని, ఆయన చూపిన మార్గం భావితరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ప్రజలతో మమేకమై, వారి కష్టాలు, సమస్యలను తన కవిత్వంలో ప్రతిబింబించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చే కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించడం గర్వకారణమని తెలిపారు. కాళోజీ జయంతి ని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఆయనకు ఇవ్వబడిన అత్యున్నత గౌరవమని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జయంతి వేడుకలు తెలంగాణ భాష, సాంప్రదాయం, సంస్కృతిని కా పాడుకునే దిశగా సమాజానికి స్ఫూర్తి కలిగిస్తాయని వివరించారు. భాషా వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కాళోజీ చూపిన దారిలో నడవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో కాళోజి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. అశ్వాపురంలో తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కాలేజ్ చిత్రపటానికి పూలమాల వేసు నివాళులర్పించారు.
మణుగూరు సీఎం కార్యాలయంలో ఇన్చార్జి జీఎం వీరభద్రరావు జ యంతి వేడుకలను నిర్వహించారు. ఇల్లందు జిఎం కార్యాలయంలో బి కృష్ణయ్య కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కాళోజి నారాయణ జయంతి వేడుకలు కన్నుల పండగ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, ఓ ఎస్ డి వెంకటరమణ,ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి, మరియు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.