13-12-2025 06:46:44 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇల్లందు ఏరియా జి.యం వి.కృష్ణయ్య సూచించారు. శనివారం స్థానిక జి.యం కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏరియాలోని అన్ని గనులు, విభాగాల ఆధిపతులతో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి డిసెంబర్ 23 న నిర్వహించే సింగరేణి డే సందర్భంగా అన్ని గనులు, డిపార్ట్మెంట్ల లో ఉదయం సింగరేణి పతాక ఆవిస్కరించాలని అలాగే గనులు, కార్యాలయాలను మామిడి తోరణాలతో కొబ్బరి ఆకులు అరటి చెట్లతో, రంగురంగుల విద్యుత్ దీపాలు, రంగు కాగితాలతో అలంకరించాలని సూచించారు.
తదుపరి నిర్వహించే ఇల్లందులోని మొట్టమొదటి గని కొత్తపూసపల్లి గ్రామంలో సింగరేణి పతాక ఆవిస్కరణ చేయాలనీ సాయంకాలం జెకె కాలనీ లోని బ్లాక్ డైమండ్ స్టేడియం నందు నిర్వహించే వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాల ప్రదర్శనశాలలు, డాన్స్, స్టాల్ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఉద్యోగులు వారి కుటుంబాలు సంతోషించేలా వినోదా కార్యక్రమాలు ఏర్పాటు చేసి సింగరేణి డే వేడుకలను ఘనంగా నిర్వహించాలని అందుకు కావలసిన ప్రణాళికను రూపొందించు కోవాలని సంబంధిత అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రామస్వామి, కోయగూడెం పి. ఓ. గోవిందరావు, ఇంజినీరు ఆర్వీ నరసింహరాజు, డీజీఎం(పర్సనల్) అజ్మీర తుకారాం, డిజియం(సివిల్) రవి కుమార్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సి.ఆర్. భాను ప్రసాద్ రావు, డిజియం (వర్క్ షాప్) నాగరాజు నాయక్, జే.కే. మేనేజర్, పి.పుర్ణచందర్, బి.నాగేశ్వర రావు, పి.మహేశ్వర్ రావు, శివ వీర కుమార్, శ్యాం ప్రసాద్, సుధాకర్, ఇక్బాల్ షరీఫ్, అశోక్, జగదేశ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.