calender_icon.png 13 December, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపొందిన సర్పంచులకు సన్మానం

13-12-2025 06:45:25 PM

రాజాపూర్ : బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తేవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి(Former Minister Lakshma Reddy) అన్నారు. రాజాపూర్ మండలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను శనివారం మండల కేంద్రంలో లక్ష్మారెడ్డి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన 17 గ్రామ పంచాయతీలను గెలవడం శుభ పరిణామం అని అన్నారు. ఇదే కసితో వచ్చే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేసిన పార్టీ నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అభిమన్యు రెడ్డి,బచ్చిరెడ్డి, నరసింహులు, వెంకటయ్య గౌడ్, సత్తయ్య,అల్తాఫ్ బెగ్, వెంకటేష్,శ్రీనివాస్ నాయక్, హాతిరాం,మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.