calender_icon.png 13 December, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి చూసే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారు

13-12-2025 06:46:59 PM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి

మహబూబ్ నగర్ టౌన్ : రాష్ట ప్రభుత్వం, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు మహబూబ్ నగర్ రూరల్ మండలంలో అధిక సంఖ్యలో పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సిహారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నూతనంగా గెలుపొందిన సర్పంచులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాదారు. మండలంలో 12 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మంచి మెజార్టీలతో సర్పంచులుగా గెలిచినట్లు తెలిపారు.

నిరుపేదల సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఎన్నో ఆపోహాలు సృష్టించినా కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మండమైన విజయాన్ని అందించినట్లు తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మొదటి విడత ఎన్నికలు రావడం. సమయం తక్కువగా ఉండడం వల్ల అభ్యర్థుల ఎంపికలో కొంత ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు మేము మేజర్ గ్రామ పంచాయతీల్లో భారీ మెజార్టీలతో గెలుపొందినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేసినా వారినే సర్పంచులుగా నిలబెట్టడం జరిగిందన్నారు. రూరల్ మండలంలో కాంగ్రెస్ ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఆయా గ్రామాల నూతన సర్పంచులు మాధవ రెడ్డి, రంగయ్య, రాజు గౌడ్, బాబు రావు, తోపాటు ధర్మపూర్ నరసింహారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.