26-11-2025 12:35:28 AM
- మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు
- 27 నుంచి నామినేషన్ల ప్రక్రియ
కరీంనగర్, నవంబరు 25 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 27న ప్రారంభం కానుంది. ఇదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ 29 వరకు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన 30న నిర్వహిస్తారు. నామినేషన్ల ఉ పసంహరణ డిసెంబర్ 3న ఉంటుంది.
డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తారు. రెండవ విడత డిసెంబర్ 14న, మూడవ విడత డిసెంబర్ 17న నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు పోలింగ్ రోజే మ ధ్యాహ్నం 2 నుంచి ప్రారంభమవుతుంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి 316 గ్రామ పంచాయతీలు 2946 వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి.
మొదటి విడతలో కరీంనగర్ డివి జన్ పరిధిలోని గంగాధర మండలంలోని 33 గ్రామ పంచాయతీలు, 296 వార్డు స్థా నాలు, రామడుగు మండలంలోని 23 సర్పంచ్ స్థానాలు, 222 వార్డు స్థానాలు, చొ ప్పదండి మండలంలోని 16 సర్పంచ్ స్థానాలు, 154 వార్డు స్థానాలు, కొత్తపల్లి మండలంలోని 6 సర్పంచ్ స్థానాలు, 62 వా ర్డు స్థానాలు, కరీంనగర్ రూరల్ మండలంలోని 14 సర్పంచ్ స్థానాలు, 132 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
రెండవ విడతలో కరీంనగర్ డివిజన్ పరిధిలోని చిగురుమామిడి మండలంలోని 17 సర్పంచ్ స్థానాలు, 174 వార్డు స్థానాలు, తిమ్మాపూర్ మండలంలోని 23 సర్పంచ్ స్థానాలు, 212 వార్డు స్థానాలు, గన్నేరువరం మండలంలోని 17 సర్పంచ్ స్థానాలు, 140 వార్డు స్థానాలు, మానకొండూర్ మండలంలోని 29 సర్పంచ్ స్థానాలు, 280 వార్డు స్థానాలు, శంకరపట్నం మండలంలోని 27 సర్పంచ్ స్థానాలు, 240 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
మూడవ విడతలో హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని వీణవంక మండ లంలోని 26 సర్పంచ్ స్థానాలు, 246 వార్డు స్థానాలు, ఇల్లందకుంటలోని 18 సర్పంచ్ స్థానాలు, 166 వార్డు స్థానాలు, జమ్మికుంట మండలంలోని 20 సర్పంచ్ స్థానాలు, 188 వార్డు స్థానాలు, హుజూరాబాద్ మండలంలోని 20 సర్పంచ్ స్థానాలు, 196 వార్డు స్థా నాలు, సైదాపూర్ మండలంలోని 27 సర్పంచ్ స్థానాలు, 238 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఎన్నికల సందర్భంగా వార్డుకొక పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జగిత్యాల జిల్లాలో 385 సర్పంచ్ స్థా నాలు, పెద్దపల్లి జిల్లాలో 266 సర్పంచ్ స్థానాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 సర్పంచ్ స్థానాలు, వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలుజరగనున్నాయి.