calender_icon.png 7 November, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీడు.. తగ్గేదేలే..

07-11-2025 12:00:00 AM

-ట్రిప్పర్లు కావివి.. మృత్యు శకటాలు..

-అడ్డగోలుగా కంకర  మిల్లుల దందా..

-లోడ్ ఎక్కువే..వేగం ఎక్కువే..

-రోడ్డంతా కంకర రాళ్లమయం 

-అడిగేవారేరి...?ఆపే వారేరి..?

-మామూళ్లతో..చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు 

-సంఘటన జరిగితేనే స్పందిస్తారా..?

గరిడేపల్లి, నవంబర్ 6 : మాకేంటి..... ఇక్కడ.... అక్కడ... సంబంధిత అధికారులకు అంతా నెలసరి మామూలు అందిస్తాం..... మాకు అడ్డే లేదు అంటూ.... కంకర్ లోడుతో వెళ్తున్న ట్రిప్పర్లు ను నడుపుతున్న డ్రైవర్ల నిర్వహకం ఇది..... టిప్పర్లు కంకరతో ఓవర్ లోడ్ పోసుకొని యదేచ్చగా, ఇష్టానుసారంగా ప్రధాన రహదారులపై మితిమీరిన వేగంతో మృత్యు శకటాల తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.... ఓవర్ లోడ్ తో కంకర పోసుకొని నియంత్రణ లేని వేగంతో ట్రిప్పర్లు తిరుగుతున్నప్ప టికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ట్రిప్పర్ల డ్రైవర్లు,కంకర మిల్లు యాజమాన్యులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండడం పట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పలుచోట్ల ప్రమాదాలకు ట్రిప్పర్లు కారణమవుతు న్నప్పటికీ వేగ నియంత్రణలో పోలీసులు, ఓవర్ లోడ్ల విషయంలో మైనింగ్ అధికారులు చూసి చూడనట్టు ఉదాసీనత వైఖరిని అవలంబిస్తుండడంతో తమకు ఎదురేలేదన్న చందంగా కంకర మిల్లుల యాజ మాన్యం ట్రిప్పర్ల డ్రైవర్లు యదేచ్చగా తిప్పుతున్నారు...గరిడేపల్లి మండలం లోని కంకర మిల్లులకు చెందిన ట్రిప్పర్లు ప్రతినిత్యం ఓవర్ లోడ్ తో, మితిమీరిన వేగంతో దర్శనమిస్తున్నాయి.

ఈ ట్రిపర్ల వేగంతో లోపట ఉన్న కంకర అంతా రోడ్డు మీద పడుతుంది. ట్రిప్పర్ వెనక ఏదైనా వాహనం వస్తే వాటి మీద కంకర రాళ్లు పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కొందరి వాహనాల ముందు ఉన్న అద్దాలు పగిలిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాక రోడ్డు మీద పడుతున్న కంకరతో ద్విచక్ర వాహనాల చోధకులు రోడ్డుపై పడి గాయాల పాలైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల చేవెళ్లలో జరిగిన టిప్పర్ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 24 మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

 పట్టించుకునే వారేరి ?..

గరిడేపల్లి మండలం లోనే కాకుండా పెన్పహాడ్ మండలం పరిధిలోని కంకర మిల్లులకు చెందిన టిప్పర్లు కూడా గరిడేపల్లి మండలంలోని మిర్యాలగూడ కోదాడ ప్రధాన రహదారిపై తిరుగుతున్నాయి.వీటి మితిమీరిన వేగంతో ఎప్పుడూ ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు మాత్రం నెలసరి మామూళ్ల తో పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.ఏదైనా ప్రమాదం జరిగితేనే అధికారులు పట్టించుకుంటారా.....? అప్పటివరకు పట్టించుకోరా....? అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

టిప్పర్ యజమానులపై చర్యలు తీసుకోవాలి

కీతవారిగూడెం సర్వారం వెళ్లే రహదారి సమీపంలో ఉన్న క్రషర్ మిల్లు నుండి కంకర్ టిప్పర్ వాహనాలు అధిక లోడుతో కంకర, డస్టుతో రోడ్లపై అతివేగంతో  నడుపుతూ రోడ్లపై ప్రమాదాలకు అడ్డాగా మారాయి. పైన పట్టా కూడా కట్టకుండా రోడ్లపై అతివేగంతో నడిపే టిప్పర్ల వాహనాల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

- పురుషోత్తం గౌడ్, కీతవారిగూడెం గ్రామస్తుడు

పెద్ద పెద్ద బ్లాస్టింగ్ లతో పెను ప్రమాదం 

కీతవారిగూడెం సమీపంలో సర్వారం వెళ్లే రహదారి వెంట ఉన్న  క్రషర్ మిల్లు నుండి బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా వచ్చే విషవాయులు ద్వారా కీతవారిగూడెంతో పాటు పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై అతి భారీ వాహనాలతో టిప్పర్ల నిండా కంకర పోసుకొని రోడ్లపై అతివేగంగా నడుపుతూ కంకరరోడ్లపై పడి ప్ర మాదాలకు నిలయంగా మారుతున్నా యి. డస్ట్ టిప్పర్లు వెనకాల బైక్ నడపాలంటే చాలా ఇబ్బందికరంగా తయార వుతుంది. కావున అధికారులు స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలి.

- పోకల వెంకటేశ్వర్లు, గానుగు బండ గ్రామస్తుడు