10-12-2025 12:11:34 AM
డీఆర్‌ఓ భుజంగరావు
మెదక్, డిసెంబర్ 9(విజయక్రాంతి): మెదక్ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ అవతరణ ఉత్సవం పురస్కరించుకొని రోడ్లు భవనాల శాఖ ఘనంగా ఏర్పాటు చేసింది. ఆర్‌అండ్ బి ఈఈ వేణు, డిఆర్‌ఓ భుజంగరావు, అదనపు ఎస్పీ మహేందర్, ఇతర జిల్లా అధికారులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ భుజంగరావు మాట్లాడుతూ ప్రజలలో ఐక్యత, ఆత్మగౌరవాన్నిపెంపొందించే ప్రతీకగా తెలంగాణ తల్లి నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు 10 అడుగుల ఎత్తులో విగ్రహం, బేస్మెంట్ 4 అడుగులు, విగ్రహం కింద ఉండే 2 అడుగుల పీఠంతో కలిపి మొత్తం 16 అడుగుల ఎత్తు కలిగిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. ఆర్‌అండ్ బీ డీఈ టెక్నికల్ కరుణ, ఏడబ్ల్యుఈ అరుణ్ రెడ్డి, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, పరిపాలన అధికారి యూనస్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.