calender_icon.png 3 January, 2026 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికైన విద్యార్థిని

03-01-2026 12:00:00 AM

చిట్యాల, జనవరి 2(విజయ క్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో చక్కటి క్రీడా ప్రతిభను కనబరిచి ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది.

డిసెంబర్ 30, 31 , జనవరి 1 న వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం షరీఫ్ అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్ లో   44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నిర్వహించిన  తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో నల్గొండ జిల్లా జట్టు మొదటి స్థానం లో నిలిచింది. నల్గొండ జిల్లా జట్టు తరుపున చిట్యాల పట్టణం లో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కొత్తపల్లి సహస్ర ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి విద్యార్థికి జ్ఞాపికను ప్రధానం చేసి అభినందించారు.

ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి విద్యతోపాటు క్రీడారంగంలో కూడా రాణించాలని, క్రీడలతో ఉన్న పోటీ తత్వాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకొని, క్రీడారంగంలో ప్రతిభ చూపటం ద్వారా భవిష్యత్తులో క్రీడా విభాగంలో ఉన్నత ఉద్యోగాలు కూడా సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోలా గోవర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థినిని అభినందించారు.