06-01-2026 12:01:19 AM
గెలుపు గుర్రాల వేటలో నేతలు ..
ముఖ్యలకు ముఖ్యమైన హామీలు
వనపర్తి, జనవరి 5 (విజయక్రాంతి): 2025 జనవరి 25 మున్సిపాలిటీ పాలక వర్గం గడువు ముగిసింది. పాలకవర్గం ముగిసిన రోజు నుండి ప్రత్యేక అధికారుల పాలన లో మున్సిపాలిటీ శాఖ పని చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాలు జారీ అయ్యాయి. అందులో భాగంగానే ఓటర్ల జాబితా సవరణ ముసాయిదా వంటి కార్యక్రమాలు కూడా వేగవంతం దిశగా పనుల్లో సంబందించిన అధికారులు నిమగ్నమయ్యారు.
కోడ్ కూయక ముందే సర్వే..
మున్సిపాలిటీ పీఠం పై తమ పార్టీ జెండా పాగ వేసేందుకు అధికార, ప్రతి పక్ష పార్టీలు ఇప్పటికే ఎత్తులకు పై ఎత్తులను వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏ వార్డు లో ఏ అభ్యర్థి నిలబడితే గెలుస్తారో వంటి సర్వే చేసే పనిలో అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా, అభ్యర్థులకు తెలియని వ్యక్తుల నుండి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డు లో గెలుపు గుర్రాల సర్వే ను నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఆర్థికంగా ఉన్నారు అటువంటి వారికీ ఇవ్వడం కన్నా ఆయా వార్డులో అభ్యర్థి ప్రవర్తన, పరిచయాలు, ప్రత్యర్థి కన్నా ఎక్కువ ఖర్చు పెట్టగలడా ఒక వేల పార్టీ నుండి బి ఫామ్ (టికెట్) ఇస్తే గెలుస్తాడా లేదా వంటి విషయాలపై లోతుగా సర్వే చేస్తున్నట్లు సమాచారం. గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తేనే మున్సిపాలిటీపై తమ పార్టీ జెండా పాగ ఉంటుందని ఆ దిశగా నాయకులు ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు.
పార్టీ టికెట్ కోసం ఆశావహుల ఆరాటం ..
పార్టీ ని నమ్ముకుని చాలా రోజుల నుండి పార్టీకి సేవ చేస్తున్నాము పార్టీ ఏ పిలుపునిచ్చిన పని చేసాం మా వార్డులో ప్రజల మద్దత్తు పుష్కలంగా ఉంది సంవత్సరం నుండి వార్డు లో వినాయక చవితి, దసరా నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ, పండుగలు, పబ్బాలు, చావులు ఇలా ఎన్నో కార్యక్రమాలకు హాజరు కావడం తో పాటు ఆర్థిక సహాయకారాలు అందిస్తూ ప్రజల మధ్యలో ఉన్నాము మాకే పార్టీ టికెట్ ఇవ్వాలని నేతల ముందుకు నాయకులతో ఆశావహులు పావులు కదుపుతున్నారు. కొన్ని వార్డు లో అధికార, ప్రతిపక్ష పార్టీలో సైతం ఇద్దరు ముగ్గురు ఆశావహులు వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యలకు ముఖ్యమైన హామీలు..
సంవత్సరం నుండి ఎదురు చూస్తున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో తాము కూడా ఫోటీలో ఉన్నామంటూ తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే ఆయా వార్డు లో యువత, ముఖ్యులతో ఇప్పటికే ఆశవహులు లోలోపల సమావేశాలను నిర్వహిం చుకుంటున్నారు. ఎలక్షన్ లో నాకు సపోర్ట్ చేస్తే వార్డులో జరుగబోయే అభివృద్ధి పనుల్లో పనులు ఇప్పిస్తా ఎం పని అడిగిన ఖచ్చితంగా చేసి పెడతాను ఇలా లెక్కకు మించి హామీలను ముఖ్యలకు హామీలను సైతం ఇస్తున్నట్లు తెలుస్తోంది.