calender_icon.png 14 August, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ వేదికపై మెతుకుసీమ ఉపాధ్యాయుడి ప్రతిభ

11-08-2025 12:31:37 AM

* తెలంగాణ సంస్కృతి ప్రదర్శన

* బెస్ట్ ప్రాక్టీస్ టీచర్ గా డాక్టర్.వి. ఉమామహేశ్వర్ రాజ్

మెదక్, ఆగస్టు 10(విజయక్రాంతి): నూతన విద్యా విధానం ద్వారా పాఠ్యాంశ బోధన చేపట్టి మంచి ఫలితాలు తేవటం ఇన్నోవేటివ్ టీచింగ్ ప్రాక్టీస్ అనే విభాగంలో గత మే, జూన్ లో నిర్వహించిన బెస్ట్ ప్రాక్టీస్ అంశంలో జాతీయ వేదికపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను బెస్ట్ ప్రాక్టీస్ టీచర్ డాక్టర్.వి. ఉమామహేశ్వర్ రాజ్ ప్రదర్శన గుర్తింపునిచ్చింది.

మెదక్ జిల్లా టేక్మాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా  పనిచేస్తున్న డాక్టర్ ఉమామహేశ్వర్ రాజ్ మెదక్ జిల్లా స్థాయిలో డీఈవో, ఎంఈఓ లు కొందరు సీనియర్ టీచర్ల బృందం ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మెదక్ జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎన్నికైన డాక్టర్.వి. ఉమామహేశ్వర్ రాజ్ తిరిగి రాష్ట్రస్థాయిలో ఇదే బెస్ట్ ప్రాక్టీసెస్ అనే అంశంపై ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, శిక్షణలో ఉన్న 200 మంది ఎంఈఓల ముందు, కొంతమంది సీనియర్ ఉపాధ్యాయుల ముందు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి జాతీయ స్థాయికి ఎన్నికవ్వడం జరిగింది.

జాతీయస్థాయి ఎన్ ఈ పి 2020 ఓరియంటేషన్ ప్రోగ్రాంలో రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో సిసిఆర్టి శిక్షణ కార్యాలయంలో 22 రోజుల శిక్షణ పూర్తి చేసి తెలంగాణ సంస్కృతి ప్రదర్శనలో రాష్ట్రస్థాయిలో పేరు ప్రతిష్టలు తెచ్చి సీసీఆర్ టి న్యూఢిల్లీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ చేతుల మీదుగా జాతీయస్థాయి ప్రశంసా పత్రం అందుకోవడంజరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్రాజ్ను జిల్లా ఉపాధ్యాయ బృందాలు, విద్యాశాఖ అధికారులు అభినందించారు.