02-05-2025 12:10:54 AM
కరీంనగర్, మే 1 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని స్థానిక హనుమాన్‌నగర్‌లో ఉన్న బ్లూబెల్స్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. వరుసగా పదో సంవత్సరం కూడా 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాల ప్రభంజనం సృష్టించింది.
575 మార్కులతో కే స్మరణి టాపర్‌గా నిలిచారు. జీ శ్రావ్య -574, పీ నిశ్విక 572, డీ శ్రీనిధి -567, కే శ్రీనిధి 555, వీ బిందులహరి- 552, కే హర్షవర్ధన్ 551, ఎం భవిత్ 546, కే హరిణి -546, కే అక్షిత- 544 మార్కులు సాధించారు. మొత్తం 37 మంది విద్యార్థులకు 26 మంది 500కు పైగా మార్కులు సాధించారని పాఠశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ జంగ సునీత మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.