10-01-2026 12:00:00 AM
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, జనవరి 9 (విజయక్రాంతి): విద్యార్థులను భావితర సైంటిస్టులుగా తయారుచేసిన ఉపాధ్యాయులు అభినందనీయులని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి విద్యానికేతన్ హై స్కూల్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 870 ప్రదర్శనలు 1700 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని 7 విభాగా లలో అద్భుతమైన ప్రదర్శనను చూపి జూనియర్, సీనియర్, నేషనల్, సౌత్ ఇండియా స్థాయిలకు ప్రతి విభాగం నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు.
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రదర్శనను సందర్శించి విద్యార్థులను అభినందించడమే కాకుండా ఒక్కొక్కరికి ప్రాజెక్టు వారీగా వివరాలను అడిగి తెలుసుకుని అవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఏ ఉద్దేశంతో తయారు చేశారు తెలుసుకొని వ్యక్తిగతంగా అభినందించారు.విద్యార్థులకు సమాజానికి అవసరమైన ఆవిష్కరణ చేయాలని సూచిం చి ఉత్తేజ పరిచారు.ముగింపు సమావేశం లో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధ్యక్షత న ఎమ్మెల్సీ చిన్నమైల్ అం అంజి రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేయగా ప్రారంభించుకోవడం జరిగింది.
సైన్స్ ఫెయిర్ సందర్భంగా ప్రదర్శించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన సభాధ్య క్షులు రమణా రెడ్డి ఉపాధ్యాయులు పాత్ర గురించి సమాజంలో ఉన్నతమైనదిగా ప్రతి విద్యార్థిని ఎన్నడూ మర్చిపోని విధంగా ఉంటుందని కొనియాడినారు.అదేవిధంగా విద్యార్థులను విద్య అర్జించడం లోనే కాక సర్వతో ముఖాభివృద్ధి సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని ఉపాధ్యాయులు ఆ విధంగా కృషి చేయాలని సూచించారు.
జిల్లా సైన్స్ అధికారి సిద్ధ రామ్ రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేసి సహకరించిన 33 జిల్లాల అధికారులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.ఎస్సార్ సిటి డైరెక్టర్ నికోలాస్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం అనేకమైన పథకాలను రూపొందించడంతోపాటు విద్యాభివృద్ధి కొరకు మరియు విద్యార్థుల సంక్షేమానికి కొత్త కొత్త కార్యక్రమాలు ఎన్నో చేబడుతున్నామని అవి విద్యార్థుల విద్యాభివృద్ధికే కాక సహ పాఠ్యాంశాలలో అభివృద్ధికి కూడా దోహదపడుతున్నాయని వివరించారు.
ముఖ్య అతిథి శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు దేశభక్తి కూడా అవసరమని మారుతున్న సమాజపు అవసరాలకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలను రూపొందించాలని ఆ విధంగా విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని తెలిపారు. తదుపరి వివిధ విభాగాలలో ఉత్తమ ప్రదర్శనను కనబరిచిన విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అంబీర్ మనోహర్రావు, టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి, విద్యానికేతన్ హై స్కూల్ కబి, ప్రిన్సిపల్ జుబేర్, శ్రీశైలం, తాడ్వాయి శ్రీనివాస్, ప్రవీణ్, లక్ష్మణ్, శ్రీధర్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.