10-01-2026 12:00:00 AM
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
వెంకటాపూర్, జనవరి 9 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి టీ. రాధిక ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించగా.. విద్యార్థులే వివిధ బాధ్యతలను స్వయంగా నిర్వహిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డిఈఓ గా శ్రీజ, ప్రధానోపాధ్యాయులుగా వర్షిణి బాధ్యతలు చేపట్టగా, ఉపాధ్యాయులుగా జయశ్రీ, అంజలి, హేమశ్రీ, అవంతిక, హరిక, రోహిణి, శ్రుతి, స్వాతి, అలేఖ్య, రంజిత్, గీతాంజలి, సాయిశ్రీ, పూజిత, అక్షయ, తేజశ్రీ, ప్రత్యూష, రాకేష్, ఎల్లస్వామి, మారుతి విధులను నిర్వర్తించారు.
పీ.డి గా ప్రణయ్, అటెండర్ గా శివసాయి తమ పాత్రలను ఎంతో సమర్థవంతంగా పోషించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రాధిక మాట్లాడుతూ.. స్వయం పరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సహకారం, సమన్వయం, బాధ్యతాయుతమైన ప్రవర్తన, త్యాగం, సమయపాలన, క్రమశిక్షణ వంటి ప్రజాస్వామ్య విలువలు అలవడతాయని వివరించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఫరీనా బేగం మాట్లాడుతూ.. స్వయం పరిపాలన దినోత్సవం భవిష్యత్తు ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అనంతరం సీనియర్ ఉపాధ్యాయులు బాబూరావు మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని భవిష్యత్తులో ఉన్నత పదవులను అలంకరించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాబూరావు, ఫిరోజ్, కిరణ్ కుమార్, మహేష్, అంబేడ్కర్, కిషోర్, జ్యోస్న, నవీన్, వేణు పాల్గొన్నారు.