08-01-2026 12:41:30 AM
న్యూఢిల్లీ, జనవరి 7: కేంద్ర బడ్జెట్ 2026 ముహూర్తం ఏ రోజు ఉంటుందనేది ఉత్కంఠకు తెరపడింది. యేటా ఫిబ్రవరి 1వ తేదీనే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది కూడా అదే తేదీననే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఖరారు చేసిం ది.
బుధవారం భేటీ అయిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఫిబ్రవరి1 ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు నిర్ణయిం చింది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయంతో చరిత్రలో మొదటిసారి ఆదివారం కేంద్రప్రభుత్వం పద్దు ప్రవేశపెట్టి, సరికొత్త రికార్డుకు నాంది పలుకనుంది. అన్ని సజావుగా సాగితే ఈ నెల ౩1న బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.