08-01-2026 12:42:52 AM
మోదీకి ఫోన్ చేసిన ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నేతన్యాహు
న్యూఢిల్లీ, జనవరి 7: ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నేతన్యాహు బుధవారం ప్రధాని మోదీకి ఫోన్‌చేసి గాజా శాంతి ప్రణాళిక అమలుపై తాజా పరిణామాలను వివరించా రు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలు పుకుంటూ, ఇరు దేశాల మధ్య శాంతి, శ్రేయ స్సు కొనసాగాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్‌కు భారతదేశం స్థిరమైన మద్దతు ఉంటుం దని మోదీ పునరుద్ఘాటించారు.
ఈ చర్చలతో ఉగ్రవాదంపై పోరాటంలో ఇరుదేశా లు తమ ఉమ్మడి సంకల్పా న్ని మరోసారి స్పష్టం చేశాయి. ఏ రూపంలో ఉన్నా సరే ఉగ్రవాదాన్ని సహించబోమని (జీరో టాలరెన్స్), ఈ ముప్పును ఎదుర్కోవడానికి దృఢ నిశ్చయంతో కలిసి పనిచేస్తామని ఇద్దరు ప్రతిజ్ఞ చేశారు. కేవలం భద్రతా పరమైన అంశాలే కాకుండా, పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువల ప్రాతిపదికన భారత్- జ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రా బోయే కాలంలో మరింత బలోపేతం చేసుకోవాలని తెలిపారు. ఈ చర్చల అనంతరం మోదీ ఎక్స్‌లో బుధవారం పోస్టు చేస్తూ ద్వారా మిత్రుడు బెంజిమిన్ నేతన్యాహుతో మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు.