18-12-2025 01:29:07 AM
సర్పంచ్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 17: రానున్న ఎన్నికలు పార్టీ గుర్తుతో ఉంటాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన స్వగృహం నందు సర్పంచ్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
ప్రజల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని,అధిక స్థానాలు గెలుస్తామని పేర్కొన్నారు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన రూ. 3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 24% నుంచి 17%కి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపింది.
ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే రావాలి. ఆ నిధులను ఆపే హక్కు ఎమ్మెల్యే..నాయకుడిని లేదని చెప్పారు. సర్పంచ్ లకు సహాయం చేసేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మీకు వచ్చిన ఈ పదవి ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో వినియోగించాలని తెలిపారు.
గ్రామాల్లో పార్టీ బలంగా ఉంది.. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
పార్టీకి పట్టుకొమ్మలెక్కన ఉన్న నాయకులు.. కార్యకర్తలకు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం కెసిఆర్ పాలమూరు ప్రాజెక్ట్ కోసం సమావేశం పెట్టి ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. అందరం ఐక్యంగా ఉండి ముందుకు సాగదామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, హన్వాడ మాజీ ఎంపీపీ బాలరాజు,
మాజీ జడ్పీటీసీ నరేందర్, మహాబూబ్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లు ఆంజనేయులు, రహమాన్ సీనియర్ నాయకులు కొండ లక్ష్మయ్య, శ్రీనివాసులు, చెన్నయ్య, అల్లావుద్దీన్, అన్వార్ తదితరులు పాల్గొన్నారు.