18-12-2025 01:31:05 AM
అధికార పార్టీపై అప్పుడే వ్యతిరేకత చూపారా..?
లేక వీరిపాలనపై ప్రజలు విరక్తి చెందారా..?
రెండు సెగ్మెంట్లలో బెడిసికొట్టిన గ్రామ పాలన
మహబూబ్ నగర్, డిసెంబర్ 17 (విజయ క్రాంతి) : గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లో.. అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా అంతట మెజార్టీ స్థానాలు దక్కించుకొని విజయకేతనం ఎగిరేసింది. కాగా మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ఇద్దరి ఎమ్మెల్యేలకు సొంత గ్రామాల్లోని ప్రజలు గట్టి షాక్ నిచ్చింది అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో ఇతర ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మొదటి విడతలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డి గూడలో బిజెపి అభ్యర్థి గెలుపొంది గట్టి షాక్కునిచ్చారు. ఆ షాక్ నుండి తేరుకోక ముందే నిర్వహించిన రెండో విడతలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సొంత గ్రామమైన దమగ్నాపూర్ లో బిఅర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొంది మరో షాక్ నిచ్చారు.
నియోజకవర్గంలోని గ్రామాలలో మెజార్టీగా దక్కించుకోవాలన్నా ఎమ్మెల్యేలకు ఇలా సొంత గ్రామంలోని చుక్కెదురుకోవడం అందర్నీ ఆశ్చర్యం గురిచేస్తుంది ఎమ్మెల్యేలుగా రెండేళ్ల కాలంలోనే వీరికి ప్రజల నుండి వ్యతిరేకత ఎదురైందా లేక వీరి పాలన నచ్చడం లేదా అనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. కాగా ఆ ఎమ్మెల్యేలు ఇద్దరు రచ్చ గెలిచారు.. ఇంటనే అనగా వారి సొంత గ్రామాలలోని సర్పంచ్ అభ్యర్థులను గెలిపించలేకపోయారు అనే విమర్శ రోజురోజుకు ఉత్పన్నమవుతుంది.
ఒకచోట బీజేపీ.. మరోచోట బీఆర్‌ఎస్..
సంచల పట్టణంలో చేసి మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూ అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డి గూడాలో బిజెపి అభ్యర్థి గెలుపొందిన విషయం వివిధమే. దేవరకద్ర ఎమ్మెల్యే సొంత గ్రామమైన దమగ్నపుర్ గ్రామంలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు వారి సొంత గ్రామాలలో వ్యతిరేకక ఓటు ఎక్కువ కావడంతో ఎలా జరిగింది ఎందుకు గల కారణాలు ఏంటి అని ప్రత్యేకంగా అన్వేషిస్తున్నట్లు తెలుస్తుంది.
నియోజకవర్గంలో అన్ని గ్రామాల సర్పంచ్ అభ్యర్థులను బలపరిచి గెలిపించుకోవాల్సిన ఎమ్మెల్యేలు సొంత గ్రామంలోని వెనకంచిలో ఉండడంతో ఈ విమర్శను ప్రతి విమర్శగా మార్చి చెప్పేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారంటే ఈ విషయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుందని తెలుస్తుంది.
దెబ్బతింటున్న కాంగ్రెస్ క్యాడర్..
ఆ నియోజకవర్గాలలో సొంత గ్రామాలలోని సర్పంచ్ అభ్యర్థులను బలపరిచి ఓటమి పాలు కావడంతో ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనే పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. రెండేళ్లు పూర్తి చేసుకున్న అధికార పార్టీ ఆశించిన మేరకు సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవడంలో తీవ్ర నిరాశకే గురి చేసిందని పలు అంచనాలు చెబుతున్నాయి.
వీటి ని పూర్తిగా పక్కకు పెట్టి చక్కదిద్దీపనలు ఇప్పటినుంచి ప్రారంభమైతేనే ఎంపిటిసి, జెడ్పిటిసి సీట్లను అత్యధికంగా కైవసం చేసుకుని జెడ్పి పీఠాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలకు ఈ చర్యలు ఎంతో ఉపయోగపడి ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వంతోపాటు ప్రజా ప్రతినిధులు కూడా ఆశించిన మేరకు పబ్లిసిటీ చేయడం లేదని విమర్శ కూడా సొంత పార్టీ నేతల నుంచే ఎదురు కావడం విశేషం. ఈ ఆరోపణలకు ముగింపు పెడుతూ నూతన విధానాలకు శ్రీకారం చుడితేనే కాంగ్రెస్కు భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు రాబట్టుకుంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్న మాట.