calender_icon.png 24 January, 2026 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీని ఢీకొన్న వ్యాన్.. క్లీనర్ మృతి

24-09-2024 01:10:59 AM

వైరా, సెప్టెంబర్ 23: ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని కోళ్ల వ్యాను వేగంగా వచ్చి ఢీకొనడంతో వ్యాన్ క్లీనర్ తమ్మిశెట్టి గోపి(20) అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు తల్లాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.