24-01-2026 02:10:36 PM
షాద్ నగర్, జనవరి 24 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి ల నేతృత్వంలో షాద్‌నగర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. శనివారం చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల నగారా మోగించిన హై.ఈనెల 27న మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ వెలువబడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ యుద్దానికి సిద్ధమయింది. ఇందులో భాగంగా ఇటీవల ఆయా వార్డుల్లో రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ దీపాలు తదితర అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున చేపడుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మున్సిపల్ పోరుకు ముందు విజయ సంకేతాన్ని ప్రదర్శించారు.
జనంతో ముచ్చటిస్తు.. ముందుకు సాగుతూ..
ఎమ్మెల్యే శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిలు రోడ్డుకు ఇరువైపులా ప్రజలకు అభివాదం చేస్తూ వ్యాపారస్తులను చేతిలో చేయి వేసి నమస్కరిస్తూ ముందుకు సాగారు. కాంగ్రెస్ పార్టీ జన ప్రభంజనం పేరుతో శనివారం చౌడమ్మ గుట్ట నుండి భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితర పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాదయాత్రగా బయలుదేరి పట్టణంలో చౌరస్తా మీదుగా మెయిన్ రోడ్డు పటేల్ రోడ్డు ఇంకా అనేక ముఖ్యమైన ప్రాంతాల్లో ర్యాలీగా బయలుదేరారు. జానపద కళాకారుల డప్పుమోతలు నృత్యాలతో అలరించారు.
కాంగ్రెస్ నాయకులు శ్యాంసుందర్ రెడ్డి తాండ్ర కాశీనాథ్ రెడ్డి, శివశంకర్ గౌడ్ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, శ్రావణి, మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ చెంది తిరుపతిరెడ్డి, రఘు నాయక్, జంగారీ రవి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, రవీందర్ రెడ్డి, గోటిక గోపాల్ రెడ్డి, జమ్రుద్ ఖాన్, అప్పి, చందు రాథోడ్, పట్టణానికి చెందిన 28 వార్డులకు సంబంధించిన ఆశావాహులు, నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు ఉపసర్పంచులు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల శ్రేణులు, మహిళ నాయకురాళ్లు పెద్ద ఎత్తున ర్యాలీకి హాజరయ్యారు.
14 సీసీ రోడ్లు.. రూ.3కోట్లు శంకుస్థాపన చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల 6వ వార్డులో దాదాపు 3 కోట్ల రూపాయలతో 14 సీసీ రోడ్లకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపనలు చేశారు. వార్డులో పలువు ప్రజలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వయంగా కలుసుకుని వాళ్లతో ముచ్చటించారు. అభివృద్ధి పథంలో మున్సిపాలిటీ నడుస్తుందని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఆశీర్వాదాలు కావాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. ఎంత అభివృద్ధి అయినా చేసేందుకు తన సిద్ధంగా ఉన్నానని నిధులు కూడా సమకూర్చుతానని దాదాపు మూడు కోట్లతో 14 సీసీఓ రోడ్లు నిర్మాణం చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు.