calender_icon.png 20 May, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధానికి విరామమే తప్ప ముగియలేదు

20-05-2025 01:07:12 AM

- దేశానికి ఆపదొస్తే అంతు చూసేందుకు మన సైన్యం రెడీ

- ఆపరేషన్ సిందూర్‌తో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలిసింది

- మోదీ నాయకత్వానికి, భారత సైన్యానికి సంఘీభావంగా ‘తిరంగా ర్యాలీ’ 

- కంట్రోల్ రూం బాధ్యతలు నిర్వర్తిస్తూ సైన్యం సాహసాలను కళ్లారా చూసే భాగ్యం కలిగింది

- ‘తిరంగా ర్యాలీ’లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

- కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి రాంనగర్ వరకు ‘తిరంగా ర్యాలీ’ నిర్వహించిన బీజేపీ

కరీంనగర్, మే19(విజయక్రాంతి); యు ద్దానికి విరామమే తప్ప ముగియలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమార్ చెప్పారు. దేశానికి ఆపదొస్తే టెర్రరిస్టుల అంతూ చూసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు.

  ఆపరేషన్ సిం ధూర్ తో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలిసిందన్నారు. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను ముట్టుపెట్టిన ఘనత మన సైనికులదే నని కొనియాడారు. నరేంద్ర మోదీ నాయకత్వానికి, భారత సైన్యానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ‘తిరంగా ర్యాలీ’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కరీంనగర్ లోని గీ తాభవన్ చౌరస్తా నుండి రాంనగర్ చౌరస్తా నుండి ‘తిరంగా ర్యాలీ నిర్వహించారు. వే లాది మంది కార్యకర్తలు, ప్రజలు జాతీయ జెండాను చేతబట్టి ఈ ర్యాలీకి తరలివచ్చి ప్రధాని మోదీ నాయకత్వానికి, భారత సైన్యానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్బం గా బండి సంజయ్ మాట్లాడుతూ.. పహల్గాంలో అమాయక హిందువులపైన, ప్రజలపైన ఉగ్రవాదులు జరిపిన దాడి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలతో భారత సైనికులు పాకిస్తాన్ లోని టెర్రరిస్టుల శిబిరాలను ధ్వంసం చేశారన్నా రు.

మోదీకి, సైన్యానికి సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా ‘తిరంగా ర్యాలీ’ నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే కరీంనగర్ లో నిర్వహించిన ర్యాలీకి భారీ ఎత్తున హాజరై సంఘీభావం తెలిపారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ సామాన్య ప్రజల ప్రాణా లకు నష్టం లేకుండా ఆ దేశంలోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తీరు అమోఘం అన్నారు.

దాదాపు 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టిన ఘనత సైనికులదే. మోదీ నాయకత్వ పటిమను చూసి యావత్ ప్రపంచమంతా శెభాష్ అంటోందన్నారు  కరోనా, ఆపరేషన్ సింధూర్ వంటి క్లిష్ట సమయాల్లో మన దేశానికి ఏది మంచిదో, ఎప్పుడు ఏం చేయాలో ఆచరిస్తూ టాప్ 5 దేశాల సరసన భారత్ ను నిలిపిన నేత మోదీ...అంతటి గొ ప్ప నాయకుడు మా ఇంట్లో, మా ఊర్లో పుడి తే బాగుండేదని భావిస్తున్నారంటే ఆయనపట్ల ఎంత అభిమానముందో అర్ధం చేసుకో వచ్చన్నారు.

మతం పేరు అడిగి ప్రజలను చంపడం దుర్మార్గమని పెహల్గామ్ ఉగ్రదాడి మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిందని. పిల్ల ల ముందు తండ్రిని, భార్యల ముందు భర్త ను, ప్యాంటు విప్పి కాల్చి చంపాలని ఏ మ తం చెప్పింది అని ప్రశ్నించారు. ఉగ్రవాదుల అరాచకాలకు అంతులేకుం డా పోతోందని.

2005, 2006లో ముంబై లోకల్ ట్రైన్లలో బాంబుపేలుళ్లు, ముంబయి పేలుళ్లు, కోయంబత్తూరు, జామా మసీదు పేలుళ్లు... హైదరాబాద్ లో గోకుల్ చాట్, లుంబనీపార్కు, దిల్ సుఖ్ నగర్, మక్కా మ సీదు పేలుళ్లు ఇంకా గుర్తుకొస్తున్నయన్నారు. దేశంలో అల్లర్లు స్రుష్టించి అల్లకల్లోలం చేయాలని కుట్ర చేసింది. అందుకే మోదీ నా యకత్వంలో మన సైన్యం ‘యురి’లో మన సైనికులపై దాడి చేస్తే పి ఓ కె వెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి నం అన్నారు.

2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా జైషే మహమ్మద్ హెడ్క్వార్టర్స్పై సర్జికల్ స్ట్రయిక్స్....  ఏప్రిల్ 22న పెహల్గా మ్లో ఉగ్రవాద ఘటనకు ప్రతీకారమే ఆపరేషన్ సింధూర్ అన్నారు. 23 నిమిషాల్లోనూ పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాల ధ్వంసం చెయడం జరిగిందని 100దా కా ఉగ్రవాదుల హతం అయ్యారని యుద్దానికి విరామమే తప్ప ముగిసినట్లు కాదన్నా రు. దేశానికి టెర్రరిస్టులవల్ల ఎప్పుడు ముప్పు వాటిల్లినా  వాళ్ల అంతు చూస్తామన్నారు.

“ఆపరేషన్ సింధూర్‌” పేరుతో అద్బుతమైన సేవలందించిన మన భారత సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేస్తూ నిర్వహిస్తున్న ఈ ‘తిరంగా యాత్ర... మద్దతిస్తున్న సమస్త ప్రజానీకానికి శతకోటి వందనాలు తెలిపా రు. నరేంద్రమోదీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగడం నా అద్రుష్టం. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కంట్రోల్ రూం బాధ్యతలు నిర్వర్తిస్తూ భారత సైనికుల ధైర్యసాహసాలను కళ్లారా చూసే అద్రుష్టం నాకు కలిగింది. మన భారత సైనికులను చూసి గర్విస్తున్నా అన్నారు.