calender_icon.png 19 May, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాటర్ ట్యాంక్ కదులుతుంది

17-05-2025 12:00:00 AM

  1. శిథిలావస్థలో వాటర్ ట్యాంకు... పట్టించుకోని అధికారులు
  2. ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..?
  3. వాటర్ ట్యాంక్ చూస్తేనే భయపడుతున్న రోగులు

చిన్న చింతకుంట, ఏప్రిల్ 16 :  మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో నిర్మించిన వాటర్ ట్యాం క్ భారీ ఈదురు గాలులకు కదులుతుంది.   గత కొన్ని సంవత్సరాల క్రితం తాగు నీటి సరఫరా కోసం నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరి చిన్నపాటి గాలులకు సైతం కదులాడుతుందని గ్రామస్తులు తెలుపుతున్నారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం కొసం వచ్చే రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

లక్ష లీటర్ల సామర్థ్యం గల ఈ వాటర్ ట్యాంక్ ను దాదాపు 30 సంవత్సరాల క్రితం ని ర్మించారు. ఇప్పుడు శిథిలావస్థ లో ఉన్నందున గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు వాటర్ ట్యాంకు లోపల శుభ్రం చేసేందుకు జంకుతున్నారు ఈ వాటర్ ట్యాంకు ద్వారా  6,7,8 వ వార్డులకు  కుళాయి ద్వారా కలుషితమైన నీరు సరఫరా అవుతుండడంతో కాలనీవాసులు  ఈ ట్యాంకు ద్వారా వచ్చే నీరు మాకొద్దు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా ఇది పూర్తిగా శిథిలావస్తకు చేరి, పగులు ఏర్పడి, పెచ్చులూడి పోయాయి.

వాటర్ ట్యాంక్ పక్కన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఉన్నందున రాబోయేది వర్షాకాలం కావడంతో  హాస్పిటల్ కి వచ్చే రోగులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. శిధిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ను పూర్తిస్థాయిలో పరిశీలన చేసి ఆ స్థానంలో కొత్త వాటర్ ట్యాంకును నిర్మించి కాలనీవాసులకు స్వచ్ఛమైన నీటిని అందించాలని పంచాయత్ రాజ్ శాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు.