calender_icon.png 18 May, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షాన్ని మించి ధాన్యం కొనుగోళ్లు

17-05-2025 12:21:57 AM

మరో 15 రోజులు కొనుగోళ్లు

పెద్దపల్లి, మే16(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో లక్షాన్ని మించి శాన్యం కొనుగోలు చేశారు. రాబోయే 15 రోజులలో కొనుగోలు కేంద్రాలకు  ధాన్యం రానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని  కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలు, రవాణా వాహనాల కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని  నిర్ణయించారు. రాష్ట్రంలో   ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 7 లక్షల 70 వేల 477 మంది రైతుల నుంచి  49 .53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8 వేల 42 కోట్లు మద్దతు ధర కింద చెల్లించారు.

ఈ యాసంగి సీజన్ లో గతంలో కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశారు.  గత సీజన్ కంటే అధికంగా ధాన్యం కొనుగోళ్లు పెద్దపల్లి జిల్లాలో కూడా  గత యాసంగిలో సీజన్ కంటే ఈ యాసంగి సీజన్లో వరిధాన్యం అధికంగా కొనుగోలు చేశారు. గత సీజన్లో మే 16 వరకు 2,32,281 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం 2,56,810 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.

జిల్లాలో 319 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 35,007 మంది రైతుల నుంచి 592 కోట్ల 78 లక్షల విలువగల 2,56,810 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 30,210 మంది రైతులకు 500 కోట్ల 12 లక్షల రూపాయలు చెల్లింపులు పూర్తి చేశారు.

వరి కోతలు ముగింపు దశకు చేరుకోగా, మరో వారం పది రోజుల్లో 60 నుంచి 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే సన్నరకం ధాన్యానికి కూడా బోనస్ డబ్బులు సైతం జమ కావాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాలో గతంలో కంటే ఈ సీజన్లో వరిధాన్యం కొనుగోళ్లు అధికంగా సాగగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులు అభినందించారు. 

48 గంటల్లోనే చెల్లింపులు...

వరిధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు పూర్తి చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాల వద్ద అనసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు లేకుండా చర్యలు తీసుకున్నాం. రవాణా వాహ నాలు, హమాలీల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. గత సీజన్లో కంటే ఈ సీజన్లో వరిధాన్యంగా అధికంగా కొనుగోలు చేశాం.

 డి. వేణు, అదనపు కలెక్టర్