26-07-2025 12:00:00 AM
బెజ్జంకి, జులై 25: బెజ్జెంకి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కెడిసీసీ (కరీంనగర్ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) భవన నిర్మాణ పనులను పిఏసిఏస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు శుక్రవారం పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యత పాటించాలని, భావన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్వంతస్థలంలో బ్యాంకు భవనం నిర్మాణ పనులు పూర్తికాగానే అందులోకి బ్యాంకు మారుస్తామని తెలిపారు. భవనం నిర్మాణ పనులు చివరి దశకు చేరాయని చెప్పారు. సంతబాణంలో సేవలు ప్రారంభించాక ఖాతాదారులకు ఇబ్బందులు తొలగిపోతాయని ఉమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండి రమేష్, సిబ్బంది ఆంజనేయులు, కల్లూరి అజయ్, సంగం మధు పాల్గొన్నారు.