27-09-2025 06:16:33 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్ పేట్ కాలనీలో రూ.22.77 (ఇరవైరెండు లక్షల డెబ్బై ఏడు వేలు) లక్షలతో శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేసారు. ముందుగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు.