16 April, 2026 | 11:51 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి

07-01-2026 12:00 AM

ఎంపీ రఘునందన్ రావు 

తూప్రాన్, జనవరి 6: మెదక్ జిల్లా తూప్రాన్ బిజెపి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు మంగళవారం తూప్రాన్ లో కట్ చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశం బాగుండాలని ఆహార్నిశలు పనిచేస్తున్న ప్రధాన మంత్రి మోడీని ఆదర్శంగా తీసుకొని నాయకులు కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నాయకులు ఒకరిపై ఒకరు సాకులు చెప్పడం కాకుండా కలిసి పనిచేయడం వల్ల ఫలితాలు సాధిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామ్మోహన్ గౌడ్, మల్లేష్, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, సాయి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.