03-05-2025 12:21:06 AM
సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్
భద్రాచలంలో ప్రజా కళాకారుల ఆట-పాట
భద్రాచలం, మే2 (విజయ క్రాంతి) ప్రపంచ కార్మిక దినోత్సవం‘మే డే‘ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ప్రజా కళాకారుల ఆట-పాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆటపాట కార్యక్రమం ప్రారంభ సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ పాలకులు అవలంబిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజా కళారూపాల ద్వారా ఎండగట్టాలన్నారు.
దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం, సమస్త ప్రజల హక్కులపై దాడి పెరిగిందన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ వర్గాలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఊడిగం చేస్తోందని విమర్శించారు కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తూ దేశభక్తి ముసుగులో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందుతుందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖునిచేస్తూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని రాజ్యాంగాన్ని నీరుకార్చి ఆ స్థానంలో మనువాదాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రజానాట్యమండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు ఐ వి,
పూర్వ ప్రజానాట్యమండలి నాయకులు డేగల మాధవరావు గడ్డం సుధాకర్ సింగు కోటేశ్వరరావు, బందెల చంటి ల సారధ్యంలో ప్రదర్శించిన కళారూపాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఆటపాట కార్యక్రమం నిర్వహణ భద్రాచలం పట్టణ నాయకులు గడ్డం స్వామి, డి సీతాలక్ష్మి, ఏజే గౌతమి లు నిర్వహణ బాధ్యత చూశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి ఉపాధ్యక్షులు ఎంబి నర్సారెడ్డి పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు, సిఐటియు పట్టణ నాయకులు పి సంతోష్ కుమార్, అజయ్ కుమార్,ఐద్వా నాయకులు నాదెళ్ల లీలావతి, ఉస్తేలా జ్యోతి, జీవనజ్యోతి, డి కనక శ్రీ, తదితరులు పాల్గొన్నారు..