09-05-2025 03:07:03 AM
ముగ్గురి అరెస్టు
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): అంబర్‌పేటలోని ఓ బంగా రం దుకాణంలో చోరీకి పాల్పడిన ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. పాతబస్తీ మొఘల్‌పురాకు చెందిన సయ్యద్ ఆరిఫ్ ఉద్దీన్(40), షేక్ అహ్మద్ ఉద్దీన్(45), నసీమా బేగం(40), కయాం సుల్తానా(70) కలిసి ఈ నెల 5న అంబర్‌పేట తిరుమలనగర్‌లోని భవన్‌లాల్ బంగా రం షాపులో యజమాని దృష్టి మ ళ్లించి రూ.2 లక్షల విలువగల బం గారు గాజులు చోరీ చేశారు. యజమాని ఫిర్యాదుతో అంబర్‌పేట పోలీసులకు దర్యాప్తు చేసి ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు.