calender_icon.png 9 May, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి మృతి

09-05-2025 03:10:38 AM

సీఎం రేవంత్ సహా పలువురు నేతల సంతాపం

మేడ్చల్, మే 8 (విజయక్రాంతి): ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి(80) గురువారం మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్వి భజనలో కొత్తగా ఏర్పడిన ఉప్పల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యుడిగా కొనసాగారు. గతంలో కాప్రా మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు.

రాజిరెడ్డి తమ్ముడు బండారు లక్ష్మారెడ్డి ప్రస్తుత ఉప్ప ల్ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బండారు రాజిరెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతా పం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఉప్పల్ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు. రాజిరెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 

రాజిరెడ్డి ప్రజానాయకుడు: కేటీఆర్

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండా రు రాజిరెడ్డి ప్రజానాయకుడంటూ బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. రాజిరెడ్డి ఉప్పల్ నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించి నిబద్ధత గల ప్రజానాయకుడిగా ప్రజల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటార న్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు. 

రాజిరెడ్డి సేవలు మరువలేనివి: హరీశ్‌రావు

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బం డారు రాజిరెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతాపం తెలిపారు. రాజిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజిరెడ్డి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలు మరి చిపోలేనివని ప్రకటనలో తెలిపారు.