calender_icon.png 9 October, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాళం వేసిన ఇంట్లో చోరీ

08-10-2025 12:00:00 AM

మిర్యాలగూడ, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : తాళం వేసిన ఇంట్లో చొరబడి ఆరు తులాల బంగారం, లక్ష రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కండక్టర్ పార్వతి డ్యూటీ కి వెళ్లే  సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో తాళం వేసి వెళ్లారు.

తిరిగి ఇంటికి చేరుకోగా తాళం పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు ఇంట్లో దాచి ఉంచిన ఆరు తులాల బంగారం, లక్ష రూపాయల నగదు అపహరించకపోయినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.