08-10-2025 12:00:00 AM
లైన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు పోలవరపు సంతోష్
తుంగతుర్తి, అక్టోబర్ 7: ప్రతి వ్యక్తి తన దైనందిక జీవితంలో ఒత్తిడిని జయించినప్పుడే రోగాలకు దూరం ఉండగలుగుతారని లైన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు పోలవరపు సంతోష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో లైన్స్ క్లబ్ వారోత్సవాలు భాగంగా వాకర్స్ మీట్ ప్రోగ్రాంలో వాకర్స్ కు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒత్తిడిని జయించుటకు యోగా ,వ్యాయామం, వాకింగ్, రన్నింగ్ మన శరీరానికి అవసరమని, క్రమం తప్పకుండా పాటించినప్పుడే ఒత్తిడిని చేయించుతామని లేనియెడల రోగాలకు బానిస కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు విధిగా ఒత్తిడి లేకుండా జీవితంలో సంతప్తి చెందాలని, లేని వాటి కోసం ప్రాకులాటపడి, ఒత్తిడికి లోనై, జీవితాలు ఆగం చేసుకోవద్దని హితోపలికారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడి కేదారి, ప్రధాన కార్యదర్శి పులుసు వెంకన్న కోశాధికారి గుండ గాని రాము పోగ్రామ్ కోఆర్డినేటర్ ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి సుభాష్, లక్ష్మణరావు, ఎనగందుల గిరి, ఎనగందుల సంజీవ వాకర్స్ ఎల్లబోయిన బిక్షం, ఎర్ర హరికష్ణ శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.