09-10-2025 05:02:27 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వము జయింట్ స్టాఫ్ కౌన్సిల్(Joint Staff Council)ను పునరుద్ధరించటం పట్ల నిర్మల్ జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్నని మర్యాదపూర్వకంగా కలిసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని నిబంధనల గురించి చర్చించడం జరిగింది. జిల్లా కౌన్సిల్ కు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు. కాబట్టి వారి సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని కోరడం జరిగింది. నిర్మల్ జిల్లాలో జాయింట్ స్టాప్ కౌన్సిల్ యొక్క శాశ్వత సభ్యత్వ సంఘాలు PRTUTS, STUTS, TSUTF, TRTF కాగా TPUS రొటేషన్ పద్ధతిలో సభ్యత్వాన్ని కలిగి ఉంది.
అధికారిక కార్యక్రమాలకు, జిల్లా విద్యా వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను చర్చించే సందర్భంలో ఈ సంఘాలు మాత్రమే పాల్గొంటాయి. డీఈఓను కలిసిన వారిలో PRTUTS అధ్యక్షులు తోట నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి బి.వి. రమణారావు, STUTS అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్ ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, TSUTF అధ్యక్షులు దాసరి శంకర్, ప్రధాన కార్యదర్శి పెంట్ అశోక్, TRTF అధ్యక్షులు దర్శనం దేవేందర్, ప్రధాన కార్యదర్శి గడ్డ భూమన్న తదితరులు పాల్గొన్నారు.