calender_icon.png 9 October, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ కు పోటీ.. బాండ్ పేపర్‌పై సంతకాలకు పెట్టు!!

09-10-2025 04:49:58 PM

నంగునూరు: సర్పంచ్‌ ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థులకు సిద్దిపేట జిల్లా నంగూనూరు గ్రామ ప్రజలు వినూత్నమైన సవాలు విసిరారు. ఎన్నికల హామీలు, మ్యానిఫెస్టోలకు భిన్నంగా, ఏకంగా రూ. 100 విలువైన నాన్-జుడిషియల్ బాండ్ పేపర్‌పై సంతకం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పదవిలోకి వచ్చిన తర్వాత అక్రమాస్తులు కూడబెట్టుకుంటే, వాటిని గ్రామ పంచాయతీకి అప్పగించాలంటూ పలు అంశాలను బాండ్ పేపర్లో పొందుపర్చారు. ఈ వినూత్న పద్ధతి నంగూనూరులో ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. గెలిచే అభ్యర్థి ప్రజల నమ్మకాన్ని, ఈ బాండ్‌పై ఇచ్చిన హామీని ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.