10-10-2025 12:42:31 AM
భాషతో సంబంధం లేకుండా అగ్ర హీరోల సరసన నటిస్తూ లేడీ సూపర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో స్థానం పదిలపర్చుకున్నారు నయనతార. ఆమె సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి అప్పుడే 22 ఏళ్లు పూర్తయ్యాయి. 2003లో ‘మనస్సినక్కరే’ అనే మలయాళ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె చేతిలో 8 ప్రాజెక్టులు ఉన్నాయి. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ నయనతారే హీరోయిన్.
ఇదిలా ఉండగా, నయన్.. ఇండస్ట్రీలో తన 22 ఏళ్ల ప్రయాణాన్ని నెమరువేసుకుంటూ సోషల్‌మీడియాలో విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్‌గా మారింది. “తొలిసారి కెమెరా ముందు నిల్చోని నేటికి 22 ఏళ్లయింది. సినిమాలే నా ప్రపంచం అవుతాయని అప్పుడు తెలియదు.
అది తెలియకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాను. పరిశ్రమకు వచ్చిన తర్వాత షాట్, ఫ్రేమ్, నిశబ్దం.. ఇలా ప్రతీదీ నన్ను మార్చేశాయి. నాకు ధైర్యాన్నిచ్చాయి. నన్ను నన్నుగా మలిచాయి. ఈ జర్నీలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను” అని తన నోట్‌లో పేర్కొంది.