calender_icon.png 21 September, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంబీఏ, ఎంసీవో 7 వేల సీట్లు మిగులు

21-09-2025 12:12:22 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఎంబీఏ, ఎంసీఏలో కలిపి దాదాపు ఏడువేలకుపైగా సీట్లు మిగిలాయి. తాజాగా ఐసెట్ తుది విడత సీట్లను అభ్యర్థులకు అధికారులు కేటాయించారు. అయితే ఎంబీఏలో 30,587 సీట్లు, ఎంసీఏలో 7227 సీట్లున్నాయి. ఇందులో ఎంబీఏలో 26,131 సీట్లు, ఎంసీఏలో 4,723 సీట్లు నిండాయి. ఇంకా ఎంబీఏలో 4456 సీట్లు, ఎంసీఏలో 2504 సీట్లు మిగిలాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 23 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.