09-09-2025 12:23:39 AM
రాజకీయ నాయకులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వారు జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం రెండవ సాధారణ ఎన్నికలు ( ఎంపీటీసీ/ జెడ్పిటిసి -2025) నిర్వహణలో భాగంగా, మండల ప్రజా పరిషత్ , జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఓటర్ల జాబితా , పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారాల కోసం గుర్తిం పు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో ఐడిఓసిలో సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పా టిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం తయారు చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా , పోలింగ్ స్టేషన్లో జాబితాను రాజకీయ పార్టీ నాయకులకు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 471 పంచాయతీలలో మొత్తం 6,69,048 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,25,045, మహిళలు 3, 43,979 మంది కాగా 24 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. 4,168 వార్డులకు గాను 4,242 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఓటు హక్కు క ల్పించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు చేసుకోవడం కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని, నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పేర్లు చేర్పులు ఉండబోవు ఆయన స్పష్టం చేశారు. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ఓట్లు బదిలీ చేయడం సాధ్యం కాదన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డిప్యూటీ జెడ్పి సీఈవో చంద్రశేఖర్ , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బాల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.